హైకోర్టుకు 'గ్యాస్' సెగ.. తప్పని ఇక్కట్లు!
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును కూడా తాకింది. సిలిండర్ల సరఫరా లేకపోవడంతో హైకోర్టు క్యాంటీన్‌లో భోజన సదుపాయం నిలిచిపోయింది. వంట చేసేందుకు గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో సేవలను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు.