గురుకులంలో దారుణం.. అన్నం, నీళ్ల చారు..!

గురుకులంలో దారుణం.. అన్నం, నీళ్ల చారు..!

KMR: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. తాజాగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పెట్టిన భోజనం తినే పరిస్థితి లేదు. విద్యార్థులకు మెనూ ప్రకారం సోమవారం కిచిడి ఇవ్వాల్సి ఉండగా అన్నం, నీళ్ల చారు వడ్డించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడ్లీకి చేసిన చట్నీ కూడా నీళ్లలా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.