VIDEO: పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన
KMM: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంలో ఖాళీ గ్యాస్ సిలిండర్ భుజాలపై మోస్తూ, రోడ్డు మీద కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని కోరారు.