VIDEO: అప్పనపల్లిలో వైభవంగా వీరభద్రుని మహోత్సవాలు
కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లి సాకావారి పేటలో వేంచేసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారి మహోత్సవాలు ఆదివారం వైభవంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగిస్తూ వైనతేయి గోదావరి నది వరకు గ్రామోత్సవం నిర్వహించారు. భారీ అన్న సమారాధన నిర్వహించారు.