'కమ్యూనిటీ హాల్, స్థలం కోసం ఐకమత్యం అవసరం'
MLG: కమ్యూనిటీ హాల్, స్థలం కోసం ఐకమత్యం అవసరమని నాయీబ్రాహ్మణ సంఘం స్పష్టం చేసింది. కొత్త స్థలం సాధన సమావేశంలో జిల్లా కేంద్రంలో కీలక చర్చ జరిగింది. మంత్రి సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. ప్రస్తుత స్థలాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తప్పుదారి పట్టించే సమాచారంపై నాయి బ్రాహ్మణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.