సాంస్కృతిక కళలను ఆదరించాలి: ఎంపీ అంబిక
ATP: భారతీయ కళలు మన సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకలని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురంలోని శ్రీ సత్యసాయి కల్యాణ మండపంలో సాయి నృత్య నికేతన్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి భారతీయుడు నిత్య జీవితంలో కళలను ప్రోత్సహించాలని కోరారు. కళలను ప్రోత్సహిస్తున్న విజయలక్ష్మి, సాయి నృత్య నికేతన్ బృందాన్ని ఎంపీ అభినందించారు.