'విధి నిర్వహణలో అలసత్వం వద్దు'

'విధి నిర్వహణలో అలసత్వం వద్దు'

VKB: విధి నిర్వహణలో అలసత్వం వహించరాదని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి సిబ్బందికి సూచించారు. తాండూర్ పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రం మత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు రోగులకు అందుతున్న సేవలుపై ఆరా తీశారు. అటెండెన్స్ రికార్డులతో పాటు పలు రికార్డులను పరిశీలించారు.