ఆమంచి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాలంటీర్లు

ఆమంచి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాలంటీర్లు

ప్రకాశం: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకి చెందిన జీరు వెంకటరెడ్డి, కొల్లి సురేష్ తమ వాలంటీర్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఉదయం చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ సమక్షంలో వాలంటీర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాలంటీర్ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వాలంటీర్లు తెలిపారు.