వీరులుపాడులో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

వీరులుపాడులో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

NTR: వీరులుపాడు(M) జయంతిలో బుధవారం దుర్ఘటన జరిగింది. పొలం వద్ద JCBతో పని ముగించుకొని, లారీపై JCB తీసుకొస్తున్న గోపి అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. లారీపై ఉన్న JCB బూమ్ విద్యుత్ తీగలకు తగలబోతుండగా తప్పించే క్రమంలో గోపి కరెంట్ షాక్‌కు గురైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే సహాయానికి పరుగులు తీశారు. కానీ అప్పటికే గోపి ప్రాణాలు కోల్పోయాడు.