'పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి'
AKP: మాడుగులలో మండల స్పెషల్ ఆఫీసర్ శివప్రసాద్, ఎంపీడీవో అప్పారావు ఆధ్వర్యంలో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధుల్లో పెరిగిన తుప్పలు, డొంకలను తొలగించి కాలువల్లో పూడికను తీసి వీధులను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రత్యేకాధికారి కోరారు. అలాగే, తడి చెత్త-పొడి చెత్తపై అవగాహన కల్పించారు.