కడపలో ఇద్దరు ఉద్యోగులకు సస్పెన్షన్‌

కడపలో ఇద్దరు ఉద్యోగులకు సస్పెన్షన్‌

కడప: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం జరిగిన రివ్యూ సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడించారు. కడప కార్పోరేషన్‌ సరోజినీ నగర్ వార్డు సెక్రటరీ, సింహాద్రిపురం తహశీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్‌పై చర్యలు తీసుకున్నారు. అలాగే కడప విలేజ్ సర్వేయర్‌కు మెమోలు జారీ చేశారు.