'భూగర్భ డ్రైనేజీ సదుపాయం కల్పించాలి'

RR: హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బ్లడ్ బ్యాంక్ కాలనీలో జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ సదుపాయం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. దీంతో స్పందించి పూర్తిస్థాయిలో పైప్ లైన్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.