యూరియా కొరతతో రైతుల అవస్థలు
CTR: తవణంపల్లి మండలం పుణ్య సముద్రం గ్రామపంచాయతీ రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కొరతతో రైతులు ఉదయం నాలుగు గంటలకే బారులు తీరారు. సరిపడా ఎరువులు అందక సాగు పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, యూరియా సరఫరాను పెంచి రైతుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.