బీజేపీ అధ్యక్షుడిని పరామర్శించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు
HNK: BJP జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ శుక్రవారం సాయంత్రం వారి నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలువేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.