కామారెడ్డి జిల్లాలో 34 మంది గైర్హాజరు: డీఈవో

కామారెడ్డి జిల్లాలో 34 మంది గైర్హాజరు: డీఈవో

KMR: జిల్లాలో మంగళవారం నిర్వహించిన పదో తరగతి జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,120 మంది హాజరు కాగా, 34 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 99.74 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజుతెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.