కోతుల బీభత్సం ఇద్దరికి గాయాలు

కోతుల బీభత్సం ఇద్దరికి గాయాలు

TPT: రేణిగుంట పట్టణంలోని ఓల్డ్ చెక్ పోస్ట్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోమవారం కోతులు బీభత్సం సృష్టించాయి. పాఠశాలలో పనిచేస్తున్న ఆయామ్మ పై కోతులు దాడిచేయగా చెవికి గాయమైంది. మరో టీచర్‌కు చెయ్యికి గాయమైంది. నిత్యం కోతులు అధికంగా పాఠశాల ఆవరణ పక్కనే ఉన్న రైల్వే క్వార్టర్స్ లోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.