రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరగాలి: కలెక్టర్

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరగాలి: కలెక్టర్

GDWL: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లిస్తూ వరి, పత్తి, మొక్కజొన్నలను కొనుగోలు చేస్తోంది. వ్యవసాయ అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా, నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు.