VIDEO: 'ఉక్కు కార్మికుల జీతాలు చెల్లించాలి'

VSP: విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని స్టీల్ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు జే. అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. సోమవారం స్టీల్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట కంచాలు కొట్టి కార్మికులు నిరసన తెలిపారు. అయోధ్యరామ్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి జీతాలు చెల్లించామని ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు.