హెల్మెట్ వాడకంపై ఎస్సై ర్యాలీ

హెల్మెట్ వాడకంపై ఎస్సై ర్యాలీ

బాపట్ల: శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమంలో భాగంగా చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ సోమవారం చందోలు టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. తన సిబ్బందితో కలిసి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. వాహనదారుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.