జిల్లా వాసికి 'Unsung Guru' అవార్డు

జిల్లా వాసికి 'Unsung Guru' అవార్డు

NZB: జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ జి. నాగరాజు 'Unsung Guru' అవార్డు అందుకున్నారు. 'ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా' కోల్‌కత్తాలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒడిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును ఆదివారం అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది.