రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

కాకినాడ: జిల్లా కేంద్రంలోని చందన బ్రదర్స్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కథనం ప్రకారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో మేడిశెట్టి సాయి, మోకా గౌతమ్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.