దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ దాడి
దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వాటిని అదుపులోకి తెచ్చినట్లు దుబాయ్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పింది. కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి కారణంగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.