నేను ఏ తప్పు చేయలేదు: ఎంపీ పుట్ట మధు
ఏలూరు: డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్ట మధు ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఎన్నో రోజుల నుంచి తనను కలవాలని కొందరు పిలవడంతోనే పార్టీకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఏలూరు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని కోరారు.