తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రహదారి పరిశీలన

తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రహదారి పరిశీలన

GNTR: ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామం నుంచి సాతులూరు వైపు వెళ్లే డొంక రహదారి తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఈ రహదారి పరిస్థితిని శుక్రవారం పంచాయతీరాజ్ డీఈ కొండయ్య ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయనతో పాటు పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రహదారి పునరుద్ధరణ చర్యలపై అధికారులతో చర్చించి మరమ్మతులు చేపడతామని ఆయన తెలిపారు.