బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడి
TPT: సూళ్లూరుపేటలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి, గర్భవతిని చేసిన రాగల వెంకట రమణయ్య (54)కు జిల్లా పోక్సో కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.61,500 జరిమానా విధించింది. 2021 ఆగస్టు 1న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, విచారణ అనంతరం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.