పలు ఆలయాలను సందర్శించిన ఎమ్మెల్యే

తూ.గో: అనపర్తి మండలం అనపర్తి సావరం లోని వనుములమ్మ తల్లి, మాచరమ్మ తల్లి, గణపతి ఆలయాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి కార్యకర్తల మొక్కుని చెల్లించారు. అదేవిధంగా అనపర్తి సావరంలోని దుర్గమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.