ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రివ్యూ మీటింగ్
BHNG: ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత, ఆలేరు హౌజింగ్ ఏఈడీ. జ్యోతి, హౌజింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో మొత్తం 16 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.