VIDEO: ఎంపీ నిధులతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం
MBNR: అప్పంపల్లిలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను సర్పంచ్ నెల్లి స్వర్ణమనోహర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రోడ్ల నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సంగాల రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.