ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రకాశం: జిల్లాలో ఆదివారం వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జాతీయ రహదారిపై కిమ్స్ వైద్యశాల వద్ద గుడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడి ముగ్గురు మృతిచెందారు. ఆ లారీని మరో లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు చనిపోయారు.