అగ్ని ప్రమాదాలపై దృష్టి సారించాలి: అగ్నిమాపకశాఖ

అగ్ని ప్రమాదాలపై దృష్టి సారించాలి: అగ్నిమాపకశాఖ

HYD: గ్రేటర్ పరిధిలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తుంది. షార్ట్ సర్కూట్‌తో కొన్ని కాగా, మానవ తప్పిదాలతో మరికొన్ని అగ్ని ప్రమాదాలు జరిగి విలువైన ఆస్తులు బుగ్గి పాలవుతున్నాయి. మే నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందరూ దృష్టి సారించాలని అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు.