సొంత డబ్బులతో పిచ్చి మొక్కలను తొలగింపు

సొంత డబ్బులతో పిచ్చి మొక్కలను తొలగింపు

MHBD: గంగారం మండలం కోమట్లగూడెం గ్రామం నుంచి జంగాలపల్లి వరకు రహదారి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ZPTC ఈసం రమ-సురేష్ సొంత ఖర్చుతో పిచ్చి మొక్కలను తొలగించారు. దీంతో గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు పేర్కొన్నారు.