పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
KRNL: పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాపడ్డ ఘటన ఆదోనిలో చోటుచేసుకుంది. పట్టణంలోని హనుమాన్ నగర్ లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులు అరవింద్, చరణ్ క్లాస్ లో చదువుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పైకప్పు పెచ్చులూడి తలపై పడడంతో వారు గాయాపడ్డారు. గమనించిన పాఠశాల సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.