ఇకపై శ్రీవాణి టోకెన్లను ఆన్‌లైన్ చేసేందుకు సన్నాహాలు..?

TPT: శ్రీవారి దర్శనార్థం ఆఫ్‌లైన్ జారీచేసే శ్రీవాణి టోకెన్లను కూడా ఆన్‌లైన్ చేసేందుకు TTD కసరత్తు చేస్తోంది. ఇందుకోసం భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఆన్‌లైన్ చేయడమా, కోటా పెంచడమా లేదా యథాతధంగా కొనసాగించడమా అనేది నిర్ణయిస్తారు. కాగా, ఇప్పటికే వీటిని రోజూ ఆఫ్‌లైన్ 800, రేణిగుంట విమానాశ్రయంలో 200 ఆన్‌లైన్ 500 టోకెన్లను ఇస్తున్న విషయం తెలిసిందే.