లింగంపేట్ పీహెచ్సీలో ఆరోగ్యం మహిళా కార్యక్రమం
KMR: లింగంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ హిమబిందు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇవాళ మహిళలకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి జిల్లా టీ హబ్ పంపనున్నట్లు తెలిపారు. అలాగే రక్తహీనత తక్కువ ఉన్నవారికి పోషకాహారం తీసుకోవాలని కోరారు.