రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ

TPT: శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ జయచంద్ర రౌడీ షీటర్లను హెచ్చరించారు. ఆదివారం రేణిగుంట పట్టణంలోని అర్బన్ పోలీస్టేషన్‌కు రౌడీషీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి ప్రస్తుత జీవన శైలి గురించి అడిగి తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లరాదని వారికి హితవు పలికారు.