వరద నీరు సజావుగా ప్రవహించేందుకు చర్యలు

వరద నీరు సజావుగా ప్రవహించేందుకు చర్యలు

VZM: మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రధాన కాలువలలో వరద నీరు సజావుగా ప్రవహించేందుకు ఉన్న అడ్డంకులు అన్నింటిని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో సిబ్బంది తొలగిస్తున్నారు. లోవర్ ట్యాంక్ బండ్ రోడ్డు ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో పెద్ద చెరువు అవుట్ ఫ్లో ప్రధాన కాలువలో నీటిని త్వరగా దిగువకు పారేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నారు.