అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం
PDPL: ధర్మారం మండలం కొత్తూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. తల్లి, శిశువుల ఆరోగ్యంపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య సంగీత, కార్యదర్శి కవిత, టీచర్లు విజయ, స్వప్న, వైద్యురాలు మాణిక్య జ్యోతి, ఏఎన్ఎం జ్యోతి పాల్గొన్నారు.