రైతుల సమస్యపై ఎమ్మెల్యే పోరాటం
VZM: తంగుడుబిల్లి గ్రామంలోని సుమారు 150 రైతు కుటుంబాలకు సంబంధించిన భూమికి సరైన రెవెన్యూ రికార్డులు లేకపోవడంతో,వారికి చట్టబద్ధమైన వారసత్వ బదిలీ జరగడం లేదు. ఈమేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, రైతులతో కలిసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనితను, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డిని కలెక్టరేట్‌లో ఇవాళ కలిసి సమస్య తెలిపగా సానుకూలంగా స్పందించారు.