APK ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు: నెల్లూరు SP

APK ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు: నెల్లూరు SP

NLR: వాట్సాప్ గ్రూపులో వచ్చే APK ఫైల్స్ పట్ల జాగ్రత్త వహిస్తూ డౌన్లోడ్ చేయొద్దని SP డా. అజిత వెజెండ్ల తెలిపారు. అనధికారిక యాప్స్ ఎప్పటికైనా ప్రమాదకరమని, గుర్తు తెలియని OTPల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని వివరించారు. ఆఫర్స్ కోసం APK ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇబ్బందులు ఎదుర్కోవద్దని, APK ఫైల్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల మొబైల్, కంప్యూటర్ వైరస్ చోటు చేసుకునే పరిస్థితి ఉంటుందని SP అన్నారు.