పాఠశాలకు ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
BHPL: గోరికొత్తపల్లి (M) గాంధీనగర్‌లోని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక 20 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఇవాళ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేత కాడపాక రాజేందర్ అన్నారు. అధికారులు తాత్కాలికంగా మండలంలోని ఉపాధ్యాయులను రోజుకు ఒకరిని పంపి చదువు చెప్పిస్తున్నారు. కలెక్టర్, DEO స్పందించి ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు.