చాపరాయిలో ఒక్కరోజు ఆదాయం ఎంతంటే ?

చాపరాయిలో ఒక్కరోజు ఆదాయం ఎంతంటే ?

ASR: చాపరాయి జలపాతంలో శనివారం పర్యాటకుల రద్దీ అధికంగా కనిపించింది. ఉదయం నుంచే కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో పర్యాటకులు జలపాతాన్ని సందర్శించగా, సాయంత్రం వరకు తాకిడి తగ్గే సూచనలు కనిపించలేదు. పర్యాటకులు జలపాతం వద్ద సరదాగా గడిపారు. మొత్తం 1,953 మంది చాపరాయి జలపాతాన్ని సందర్శించారని, ప్రవేశ రుసుముల ద్వారా రూ.71,150ఆదాయం వచ్చినట్లు చాపరాయి సిబ్బంది తెలిపారు.