వైద్యసేవల పనితీరు పరిశీలించిన జిల్లా వైద్యాధికారి
BDK: గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్యాధికారి జయలక్ష్మి సందర్శించారు. ఈ మేరకు ఆమె వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, వైద్యసేవల విస్తరణ, సిబ్బంది పనితీరు, సేవల నాణ్యత తదితర అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. అనంతరం వివిధ ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు సమీక్షించేందుకు సాధారణ సమీక్ష మిషన్ బృందంతో కలిసి పరిశీలించారు.