VIDEO: MLHPల నిరసన

SKLM: ఆరోగ్యశాఖ పరిధిలోని MLHP/CHOల సమస్యలు పరిష్కారం కోరుతూ మంగళవారం శ్రీకాకుళంలో MLHPలు ధర్నా చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమని క్రమబద్దీకరించాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని జ్యోతీరావు పార్కు వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.