అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి అభినందనలు

కాకినాడ: నేడు విడుదల అయిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన చందన నేహా షణ్ముఖి 591 మార్కులతో మండల ఫస్ట్ సాధించింది. షణ్ముఖ ముక్తేశ్వరంలో ఒక ప్రైవేట్ స్కూల్‌లో చదివింది. ఈ సందర్భంగా షణ్ముఖను బుధవారం పలువురు గ్రామస్తులు, ఎన్డీయే కూటమి నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.