జగద్గురు నరేంద్రాచార్యజీని స్వామిని కలిసిన ఎమ్మెల్యే
KMR: జుక్కల్(మం) బంగారుపల్లి- దోస్త్ పల్లి శివారులో ఉన్న తెలంగాణ ఉప పీఠంలోని రామానందచార్య దక్షిణ భారత పీఠాధిపతి జగద్గురు నరేంద్రాచార్యజీ మహారాజ్‌ను గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిసి, ఆయన ఆశీస్సులు పొందారు. ఉప పీఠంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం శ్రీరామ మందిరానికి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.