రోడ్డు ప్రమాదంలో పోస్ట్ మ్యాన్ మృతి

రోడ్డు ప్రమాదంలో పోస్ట్ మ్యాన్ మృతి

BHNG: సంస్థాన్ నారాయణపురం మండలంలోని దేవిరెడ్డి బంగ్లా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్వేల్ గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ భూస వెంకటేశ్వర్లు మృతిచెందారు. ఇవాళ ఉదయం టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశ్వర్లు సర్వేల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.