శివశక్తి నగర్‌లో పడకేసిన పారిశుధ్యం

శివశక్తి నగర్‌లో పడకేసిన పారిశుధ్యం

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని శివశక్తి నగర్‌లో పారిశుధ్యం పడకేసింది. మున్సిపల్ సిబ్బంది గత కొంతకాలంగా ఎటువంటి పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో నాలాలన్నీ నిండుకున్నాయి. మురుగు కాలువలు కూడా నిర్మించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులకు మున్సిపల్ అధికారులకు చెప్పిన వారు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.