కాంగ్రెస్ ఆరోపణలు.. ఖండించిన సీఎం
తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చూపించిన డాక్యుమెంట్లన్నీ మార్ఫింగ్ చేసిన పత్రాలని వాటిలో పేర్లు, ఫొటోలు, తేదీల్లో ఎన్నో తప్పులు ఉన్నాయని తెలిపారు. 48 గంటల్లో కాంగ్రెస్‌పై క్రిమినల్, సివిల్ పరువు నష్టం దావా వేయనున్నట్లు చెప్పారు.