అన్నారెడ్డిపాలెంలో ఆధార్ క్యాంప్ నిర్వహణ

NLR: విడవలూరు మండలంలోని అన్నా రెడ్డిపాలెం సచివాలయంలో శుక్రవారం ప్రత్యేక ఆధార్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆధార్ క్యాంపులో సాయంత్రం ఐదు గంటల నాటికి ఆధార్‌కి సంబంధించిన 35 రకాల వివిధ సేవలను వినియోగించుకున్నట్లు అధికారులు తెలియజేశారు. అలగాని పాడు, అన్నా రెడ్డిపాలెం,ముదివర్తి మూడు పంచాయతీలకు సంబంధించి ఒకే చోట క్యాంప్‌ను నిర్వహించారన్నారు.