భారీ వర్షాలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీనది

RR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం చేవెళ్ల మండలంలోని దేవరపల్లి వద్ద మూసీనది ఉదృతంగా ప్రవహిస్తోంది. కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు, కాలనీలు జలమయం కాగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రమాదకర ప్రాంతాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.